ఆదికాండము 27:29 - పవిత్ర బైబిల్29 మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, “నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడతాడు, నిన్ను ఆశీర్వదించే ప్రతీ వ్యక్తి ఆశీర్వదించబడతాడు.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.” Viz kapitola |