యెహెజ్కేలు 44:24 - పవిత్ర బైబిల్24 న్యాయస్థానంలో యాజకులు న్యాయాధీశులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు తీర్పు తీర్చేటప్పుడు వారు నా కట్టడలను అనుసరిస్తారు. నా ప్రత్యేక విందుల (సమావేశాల) సమయంలో వారు నా నియమ నిబంధనలను పాటిస్తారు. వారు నేను ఏర్పాటు చేసిన ప్రత్యేక విశ్రాంతి రోజులను గౌరవించి, వాటిని పవిత్రంగా ఉంచుతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతిదినములను ఆచరించుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ప్రజల వ్యాజ్యాల్లో వారు నా విధులను బట్టి వారికి తీర్పు తీరుస్తారు. నేను నియమించిన విధులను బట్టి, కట్టడలను బట్టి, నా పండగలను జరుపుతారు. నా విశ్రాంతి దినాలను ఆచరిస్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 “ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 “ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి. Viz kapitola |