యెహెజ్కేలు 33:22 - పవిత్ర బైబిల్22 ఆ మనిషి రావడానికి ముందు నా ప్రభువైన యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. నాకు మాట్లాడే శక్తి లేకుండా దేవుడు చేశాడు. ఆ వ్యక్తి నా వద్దకు వచ్చే సమయానికి యెహోవా నా నోరు తెరపించి, నేను మాట్లాడేలాగు చేశాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నామీదికి వచ్చెను; ఉదయమున అతడు నాయొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండి నేను మౌనిని కాకయుంటిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అతడు రాకముందు సాయంత్రం యెహోవా చెయ్యి నా మీద ఉంది. ఉదయాన అతడు నా దగ్గరికి వచ్చేముందే యెహోవా నా నోరు తెరచాడు. నేను మాట్లాడగలుగుతున్నాను. అప్పటినుంచి నేను మౌనంగా లేను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అతడు ఇక్కడకు రావడానికి ముందు సాయంత్రం యెహోవా హస్తం నా మీద ఉంచి, ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రాకముందు ఆయన నా నోరు తెరిచారు. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఇక మౌనంగా ఉండను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అతడు ఇక్కడకు రావడానికి ముందు సాయంత్రం యెహోవా హస్తం నా మీద ఉంచి, ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రాకముందు ఆయన నా నోరు తెరిచారు. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఇక మౌనంగా ఉండను. Viz kapitola |