యెహెజ్కేలు 20:44 - పవిత్ర బైబిల్44 ఇశ్రాయేలు వంశములారా, మీరు ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ చెడుకార్యాలకు ఫలితంగా మీరు నాశనం చేయబడాలి. కాని నాకున్న మంచి పేరు కాపాడుకోవటానికి, మీకు నిజంగా అర్హమైన శిక్ష విధించవలసి వుండి కూడా నేను విధించను. నేనే యెహోవానని పిమ్మట మీరు తెలుసుకొంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీకీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ చెడు చేష్టలను బట్టి కాక నా పేరును బట్టి మాత్రమే నేను మీ పట్ల ఈ విధంగా చేసినప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 ఇశ్రాయేలీయులారా! మీ దుర్మార్గాన్ని బట్టి మీ చెడు పనులను బట్టి కాకుండా నా నామాన్ని బట్టే మీకు ఇలా చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 ఇశ్రాయేలీయులారా! మీ దుర్మార్గాన్ని బట్టి మీ చెడు పనులను బట్టి కాకుండా నా నామాన్ని బట్టే మీకు ఇలా చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” Viz kapitola |