యెహెజ్కేలు 11:1 - పవిత్ర బైబిల్1 తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా ఆలయపు తూర్పుద్వారం వద్దకు తీసుకొని వెళ్లింది. సూర్యుడు ఉదయించే వైపుకు ఈ ద్వారం తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవైఐదు మంది మనుష్యులున్నట్లు నేను చూశాను. అజ్జూరు కుమారుడైన యజన్యా వారితోవున్నాడు. బెనాయా కుమారుడు పెలట్యా కూడా అక్కడ వున్నాడు. పెలట్యా ఆ ప్రజలకు నాయకుడుగా ఉండెను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 పిమ్మట ఆత్మ నన్నుఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్నుదింపగా గుమ్మపు వాకిట ఇరువదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆ తరువాత ఆత్మ నన్ను పైకి ఎత్తి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గరికి తీసుకు వచ్చాడు. ద్వారం దగ్గర వాకిట్లో ఇరవై ఐదు మంది నాకు కనిపించారు. వాళ్ళలో అజ్జూరు కొడుకు యజన్యా, బెనాయా కొడుకు పెలట్యా, ఇంకా ప్రజల నాయకులూ ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు. Viz kapitola |