నిర్గమ 28:43 - పవిత్ర బైబిల్43 అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారములో ఎప్పుడు ప్రవేశించినా, ఈ వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులుగా సేవ చేసేందుకు బలిపీఠం దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారు ఈ వస్త్రాలు ధరించాలి. వారు ఈ వస్త్రాలు ధరించకపోతే, తప్పు చేసిన నేరస్థులై చావాల్సి వస్తుంది. అహరోను, అతని తర్వాత అతని కుటుంబం అంతటికీ ఇదంతా నిత్యం కొనసాగే ఒక చట్టంగా ఉండాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 అహరోను అతని కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా లేదా పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి ఎప్పుడు బలిపీఠాన్ని సమీపించినా వారు దోషశిక్షను భరించి చావకూడదంటే వారు ఖచ్చితంగా ఆ దుస్తులు ధరించాలి. “ఇది అహరోనుకు అతని కుమారులకు ఇవ్వబడిన నిత్య కట్టుబాటుగా ఉంటుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 అహరోను అతని కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా లేదా పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి ఎప్పుడు బలిపీఠాన్ని సమీపించినా వారు దోషశిక్షను భరించి చావకూడదంటే వారు ఖచ్చితంగా ఆ దుస్తులు ధరించాలి. “ఇది అహరోనుకు అతని కుమారులకు ఇవ్వబడిన నిత్య కట్టుబాటుగా ఉంటుంది. Viz kapitola |