నిర్గమ 22:15 - పవిత్ర బైబిల్15 అయితే దాని యజమాని ఆ జంతువుతో కూడా ఉంటే, పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు. లేక, ఆ పొరుగువాడు ఆ జంతువుతో పని చేయించుకొనేందుకుగాను డబ్బు చెల్లిస్తుంటే, ఆ జంతువుకు దెబ్బ తగిలినా, అది చచ్చినా, అతడు ఏమీ చెల్లించనక్కర్లేదు. ఆ జంతువును వాడుకొనేందుకు అతడు చెల్లించిన డబ్బే సరిపోతుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 దాని యజమానుడు దానితో నుండినయెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైనయెడల అది దాని అద్దెకు వచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 దాని యజమాని దానితో ఉన్నట్టయితే దాని నష్టం చెల్లించనక్కర లేదు. ఒకవేళ అది కిరాయికి తెచ్చినదైతే దాని కిరాయి డబ్బు యజమానికి చెల్లించాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దాని యజమాని దాని దగ్గరే ఉంటే, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. ఒకవేళ ఆ జంతువు అద్దెకు తెచ్చినదైతే, దాని అద్దె లోనే నష్టం సరిపెట్టబడుతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దాని యజమాని దాని దగ్గరే ఉంటే, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. ఒకవేళ ఆ జంతువు అద్దెకు తెచ్చినదైతే, దాని అద్దె లోనే నష్టం సరిపెట్టబడుతుంది. Viz kapitola |