Online Bible

- Reklamy -

2 సమూయేలు 17:20 - పవిత్ర బైబిల్

20 అబ్షాలోము సైనికులు ఆ ఇంటి యజమానురాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ వున్నారు?” అని అడిగారు. “వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ అబ్షాలోము మనుష్యులకు చెప్పింది. అబ్షాలోము మనుష్యులు యోనాతాను, అహిమయస్సులను వెదుక్కుంటూపోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొనలేదు. అందుచే అబ్షాలోము సైనికులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె–వారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అబ్షాలోము సేవకులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అహిమయస్సు, యోనాతాను ఎక్కడ ఉన్నారని అడిగారు. ఆమె “వారు నది దాటి వెళ్లిపోయారు” అని చెప్పింది. వారు వెళ్లి చుట్టుపక్కల అంతా వెతికి వారు కనబడకపోయే సరికి యెరూషలేముకు తిరిగి వచ్చారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 తర్వాత అబ్షాలోము మనుష్యులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి, “అహిమయస్సు, యోనాతానులు ఎక్కడ ఉన్నారు?” అని ఆమెను అడిగారు. అందుకామె, “వారు ఆ వాగు దాటి వెళ్లారు” అని చెప్పింది. ఆ మనుష్యులు వెదికారు గాని ఎవ్వరూ కనబడలేదు, కాబట్టి వారు యెరూషలేముకు తిరిగి వెళ్లారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 తర్వాత అబ్షాలోము మనుష్యులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి, “అహిమయస్సు, యోనాతానులు ఎక్కడ ఉన్నారు?” అని ఆమెను అడిగారు. అందుకామె, “వారు ఆ వాగు దాటి వెళ్లారు” అని చెప్పింది. ఆ మనుష్యులు వెదికారు గాని ఎవ్వరూ కనబడలేదు, కాబట్టి వారు యెరూషలేముకు తిరిగి వెళ్లారు.

Viz kapitola kopírovat

2 సమూయేలు 17:20

Následuj nás:

Reklamy

Reklamy