2 రాజులు 23:16 - పవిత్ర బైబిల్16 యోషీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద సమాధులు కనిపించాయి అతను మనుష్యులను పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకువాచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అపవిత్రము చేశాడు. దైవజనుడు ప్రకటించెనని యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరిగింది. యరొబాము బలిపీఠం ప్రక్కగా నిలబడినప్పుడు దైవజనుడు ఇది ప్రకటించాడు. తర్వాత యోషీయా చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యోషీయా అటు తిరిగి, అక్కడ పర్వత ప్రాంతంలో సమాధులను చూసి, కొందరిని పంపి, సమాధుల్లో ఉన్న ఎముకలను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రం చేశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అప్పుడు యోషీయా చూడగా ఆ కొండమీద, అతనికి ఆ కొండమీద సమాధులు కనిపించినప్పుడు, అతనికి ఆ సమాధుల్లో నుండి ఎముకలను తీయించి, బలిపీఠాన్ని అపవిత్ర పరచడానికి వాటిని దాని మీద కాల్చివేశాడు. గతంలో దైవజనుడు చాటించిన యెహోవా వాక్కు ప్రకారం ఇది జరిగింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అప్పుడు యోషీయా చూడగా ఆ కొండమీద, అతనికి ఆ కొండమీద సమాధులు కనిపించినప్పుడు, అతనికి ఆ సమాధుల్లో నుండి ఎముకలను తీయించి, బలిపీఠాన్ని అపవిత్ర పరచడానికి వాటిని దాని మీద కాల్చివేశాడు. గతంలో దైవజనుడు చాటించిన యెహోవా వాక్కు ప్రకారం ఇది జరిగింది. Viz kapitola |