2 రాజులు 16:15 - పవిత్ర బైబిల్15 అహాజు ఊరియా యాజకునికి ఆజ్ఞ విధించాడు: “ఉదయపు దహనబలులను, సాయంకాలపు ధాన్యార్పణలను, ఈ దేశంలోని ప్రజల పానీయ అర్పణలకు ఈ పెద్ద బలిపీఠం ఉపయోగించాలి. వండబడిన బలులు దహన బలులు మరి ఇతర బలుల నుండి తీసిన రక్తాన్ని పెద్ద బలిపీఠం మీద చల్లాలి. కాని అవసరము వచ్చినప్పుడల్లా నేను కంచు బలిపీఠం ఉపయోగిస్తాను.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగా–ఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజుచేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 అప్పుడు ఆహాజు రాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపిస్తూ “ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహనబలులూ, సాయంత్రం అర్పించే నైవేద్యాలూ రాజు చేసే దహనబలి, నైవేద్యాలూ, దేశపు ప్రజలందరూ అర్పించే దహనబలులు, నైవేద్యాలూ, పానార్పణలూ ఇంకా ఏ దహనబలి జరిగినా, అ బలి పశువుల రక్తాన్ని దాని మీదే చల్లాలి. అయితే, నేను దేవుణ్ణి సహాయం అడగడానికి ఈ ఇత్తడి బలిపీఠం ఉండాలి” అన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆహాజు రాజ యాజకుడైన ఊరియాకు ఇలా ఆదేశాలిచ్చాడు: “నూతన పెద్ద బలిపీఠం మీద ఉదయకాలపు దహనబలి, సాయంకాలపు భోజనార్పణ, రాజు దహనబలి, దేశ ప్రజల దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. ఈ బలిపీఠం మీద దహనబలులు ఇతర బలులన్నిటి రక్తాన్ని చల్లాలి. అయితే నేను ఇత్తడి బలిపీఠాన్ని విచారణ కోసం వాడుకుంటాను.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆహాజు రాజ యాజకుడైన ఊరియాకు ఇలా ఆదేశాలిచ్చాడు: “నూతన పెద్ద బలిపీఠం మీద ఉదయకాలపు దహనబలి, సాయంకాలపు భోజనార్పణ, రాజు దహనబలి, దేశ ప్రజల దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. ఈ బలిపీఠం మీద దహనబలులు ఇతర బలులన్నిటి రక్తాన్ని చల్లాలి. అయితే నేను ఇత్తడి బలిపీఠాన్ని విచారణ కోసం వాడుకుంటాను.” Viz kapitola |