2 రాజులు 1:16 - పవిత్ర బైబిల్16 అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అతడు వచ్చి రాజును చూచి–విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 తరువాత ఎలీయా అహజ్యాతో ఇలా అన్నాడు. “నీవు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గరికి దూతలను పంపించావు. ఈ సంగతులు అడిగి తెలుసుకోడానికి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి ఇప్పుడు నీవు పండుకున్న మంచం పైనుండి దిగవు. కచ్చితంగా చనిపోతావు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అతడు రాజుతో, “యెహోవా చెప్పే మాట ఇదే: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపించావా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు, అక్కడే చస్తావు!” అని అన్నాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అతడు రాజుతో, “యెహోవా చెప్పే మాట ఇదే: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపించావా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు, అక్కడే చస్తావు!” అని అన్నాడు. Viz kapitola |