1 రాజులు 21:29 - పవిత్ర బైబిల్29 “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బ్రతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 –అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 “అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 “అహాబు నా ఎదుట ఎలా తగ్గించుకున్నాడో గమనించావా? అతడు తనను తాను తగ్గించుకున్నందుకు అతని జీవితకాలంలో ఈ విపత్తును తీసుకురాను, కాని అతని వంశం మీద తన కుమారుని కాలంలో దానిని తెస్తాను.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 “అహాబు నా ఎదుట ఎలా తగ్గించుకున్నాడో గమనించావా? అతడు తనను తాను తగ్గించుకున్నందుకు అతని జీవితకాలంలో ఈ విపత్తును తీసుకురాను, కాని అతని వంశం మీద తన కుమారుని కాలంలో దానిని తెస్తాను.” Viz kapitola |