1 రాజులు 12:26 - పవిత్ర బైబిల్26-27 యరొబాము ఇలా అనుకున్నాడు: “ఇప్పుడు ప్రజలంతా యెరూషలేములో యెహోవా దేవాలయానికి యథాప్రకారంగా వెళుతూ వుంటే, వారు దావీదు వంశం వారిచే పాలింపబడాలని అనుకుంటారు. యూదా రాజైన రెహబామునే వారు మళ్లీ అనుసరించవచ్చు. ఆ తరువాత వారు నన్ను చంపనూవచ్చు.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 –ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవామందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానునితట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 యరొబాము ఇలా అనుకున్నాడు. “ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి ఎక్కి వెళ్తే వారి హృదయం యూదారాజు రెహబాము అనే తమ యజమాని వైపుకు తిరుగుతుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 యరొబాము తనలో తాను అనుకున్నాడు, “ఈ రాజ్యం దావీదు వంశానికి తిరిగి దక్కుతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 యరొబాము తనలో తాను అనుకున్నాడు, “ఈ రాజ్యం దావీదు వంశానికి తిరిగి దక్కుతుంది. Viz kapitola |