1 దిన 26:31 - పవిత్ర బైబిల్31 వారికి యెరీయా పెద్ద అని హెబ్రోను కుటుంబ చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి బలపరాక్రమాలుగల వారిని, నేర్పరులైన పనివారిని వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 హెబ్రోనీయులనుగూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్నవారు పరాక్రమశాలులుగా కనబడిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 ఇది హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్ద. దావీదు ఏలుబడిలో నలభయ్యవ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు, వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్న వాళ్ళు పరాక్రమశాలురుగా కనిపించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 హెబ్రోనీయులలో వారి కుటుంబ వంశావళుల ప్రకారం, యెరీయా వారికి ప్రధాన నాయకుడు. (దావీదు పరిపాలనలోని నలభైయవ సంవత్సరంలో వంశావళులను పరిశీలించినప్పుడు, గిలాదులోని యాజెరులో ఉన్న హెబ్రోనీయులలో పరాక్రమశాలులు ఉన్నారని తెలిసింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 హెబ్రోనీయులలో వారి కుటుంబ వంశావళుల ప్రకారం, యెరీయా వారికి ప్రధాన నాయకుడు. (దావీదు పరిపాలనలోని నలభైయవ సంవత్సరంలో వంశావళులను పరిశీలించినప్పుడు, గిలాదులోని యాజెరులో ఉన్న హెబ్రోనీయులలో పరాక్రమశాలులు ఉన్నారని తెలిసింది. Viz kapitola |