ప్రకటన 18:22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22-23 నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనచేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు. Viz kapitolaపవిత్ర బైబిల్22 వీణను వాయించేవాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించేవాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు. పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు. తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వీణ వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం మరి ఎన్నడు నీలో వినబడదు. వ్యాపారం చేసే ఏ పనివాడైనా నీలో ఎన్నడు కనిపించడు. తిరుగలి రాయి తిప్పే శబ్దం మరెన్నడు నీలో వినబడదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వీణ వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం మరి ఎన్నడు నీలో వినబడదు. వ్యాపారం చేసే ఏ పనివాడైనా నీలో ఎన్నడు కనిపించడు. తిరుగలి రాయి తిప్పే శబ్దం మరెన్నడు నీలో వినబడదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము22 తంతి వాయిద్యాలు వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం మరి ఎన్నడు నీలో వినబడదు. వ్యాపారం చేసే ఏ పనివాడైనను నీలో ఎన్నడు కనిపించడు. తిరుగలి రాయి తిప్పే శబ్దం మరెన్నడు నీలో వినబడదు. Viz kapitola |