న్యాయాధి 17:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అతడు తన తల్లిని చూచి–నీ యొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్నినూరు వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లి–నా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అతడు తన తల్లితో “నీ దగ్గర నుండి నేను తీసుకున్న పదకొండు వందల వెండి ఇదిగో. వాటిని తీసుకున్న వాణ్ణి నువ్వు శపించడం నేను విన్నాను. చూడు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే వాటిని దొంగిలించాను” అన్నాడు. అతని తల్లి అతణ్ణి చూసి “కొడుకా, యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక!” అంది. Viz kapitolaపవిత్ర బైబిల్2 మీకా తన తల్లితో, “నీ వద్దనున్న ఇరవై ఎనిమిది పౌండ్ల వెండి దొంగిలించిన వ్యక్తి ఎవరో నీకు తెలియునా! ఆ విషయమై ఒక శాపం ఉన్నట్లు నీవు చెప్పగా విన్నాను. సరే, వెండి నా వద్ద ఉన్నది. అది నేను తీసుకున్నాను” అన్నాడు. “కుమారుడా, నిన్ను యెహోవా ఆశీర్వదించు గాక” అన్నది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అతడు తన తల్లితో, “నీ దగ్గర నుండి తీసుకున్న పదకొండు వందల షెకెళ్ళ వెండి గురించి నీవు పెట్టిన శాపనార్థాలను నేను విన్నాను. ఆ వెండి నా దగ్గరే ఉంది, నేనే దానిని తీసుకున్నాను” అని అన్నాడు. అందుకు అతని తల్లి, “నా కుమారుడా! యెహోవా నిన్ను దీవించును గాక” అని అన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అతడు తన తల్లితో, “నీ దగ్గర నుండి తీసుకున్న పదకొండు వందల షెకెళ్ళ వెండి గురించి నీవు పెట్టిన శాపనార్థాలను నేను విన్నాను. ఆ వెండి నా దగ్గరే ఉంది, నేనే దానిని తీసుకున్నాను” అని అన్నాడు. అందుకు అతని తల్లి, “నా కుమారుడా! యెహోవా నిన్ను దీవించును గాక” అని అన్నది. Viz kapitola |