యెషయా 66:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తు వును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 తోటల్లోకి వెళ్లడానికి వాళ్ళు తమను ప్రతిష్టించుకుని, పవిత్రపరచుకుంటారు. పందిమాంసాన్నీ అసహ్యమైన పందికొక్కులను తినే వారిని అనుసరిస్తారు. “వాళ్ళు తప్పకుండా నాశనం అవుతారు.” ఇదే యెహోవా వాక్కు. Viz kapitolaపవిత్ర బైబిల్17 ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో ఆరాధించుకొనేందుకు, వారిని పవిత్రం చేసుకోవాలని చెప్పి, వారిని వారు కడుగుకొంటారు. ఈ ప్రజలు వారి తోటల్లోనికి ఒకరిని ఒకరు వెంబడిస్తారు. ఆ తర్వాత వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ, యెహోవా ఆ ప్రజలందరిని నాశనం చేస్తాడు. “పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తువులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా ఏకంగా నాశనం చేయబడతారు.” (సాక్షాత్తూ యెహోవా ఈ సంగతులు చెప్పాడు.) Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “ఎవరైతే పందిమాంసం, ఎలుకలు, ఇతర అపవిత్రమైన వాటిని తినేవాన్ని అనుసరిస్తూ, పవిత్ర తోటలోకి వెళ్లి పూజించడానికి తమను తాము ప్రతిష్ఠించుకుని శుద్ధి చేసుకుంటారో, వారు తాము అనుసరించే వానితో పాటు నశిస్తారు” అని యెహోవా తెలియజేస్తున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “ఎవరైతే పందిమాంసం, ఎలుకలు, ఇతర అపవిత్రమైన వాటిని తినేవాన్ని అనుసరిస్తూ, పవిత్ర తోటలోకి వెళ్లి పూజించడానికి తమను తాము ప్రతిష్ఠించుకుని శుద్ధి చేసుకుంటారో, వారు తాము అనుసరించే వానితో పాటు నశిస్తారు” అని యెహోవా తెలియజేస్తున్నారు. Viz kapitola |