Online Bible

- Reklamy -




ప్రసంగి 8:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 గాలి విసరకుండ చేయుటకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొర కదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఊపిరి విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

8 తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటికి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు. ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో, అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు. ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో, అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు.

Viz kapitola kopírovat




ప్రసంగి 8:8

Následuj nás:

Reklamy


Reklamy