2 దిన 6:41 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 నా దేవా, యెహోవా, శక్తికి ఆధారభూతమైన నీ మందసంతో సహా లేచి రా. నీ విశ్రాంతి స్థలం లో ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ వస్త్రాలు ధరించుకుంటారు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు గాక. Viz kapitolaపవిత్ర బైబిల్41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము. నీ యాజకులు రక్షణ పొందుదురు గాక! ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 “యెహోవా దేవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి. యెహోవా దేవా! మీ యాజకులు రక్షణను ధరించుకొందురు గాక! మీ మంచితనాన్నిబట్టి నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషించుదురు గాక! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 “యెహోవా దేవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి. యెహోవా దేవా! మీ యాజకులు రక్షణను ధరించుకొందురు గాక! మీ మంచితనాన్నిబట్టి నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషించుదురు గాక! Viz kapitola |