Online Bible

- Reklamy -

నెహెమ్యా 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మా శరీరం రక్తం మా తోటి యూదుల శరీరం రక్తం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్లాంటివారు కారా? అయినా మా కుమారులను మా కుమార్తెలను బానిసలుగా ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే మా కుమార్తెలలో కొందరు బానిసలుగా ఉన్నారు కాని మా పొలాలు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి మాకు శక్తి లేదు” అన్నారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మా కొడుకులను, కూతుళ్ళను బానిసలుగా పంపించ వలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటివారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు, ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు” అని చెప్పారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 ఆ ధనికుల్ని చూడండి. మేము వాళ్లలాంటి మనుష్యులం కామా? వాళ్ల కొడుకులకి మా కొడుకులు ఏమైనా తీసి పోయారా? అయితేనేమి, మేము మా కొడుకుల్నీ, కూతుళ్లనీ బానిసలుగా అమ్ముకోవలసి వస్తోంది. ఇప్పటికే మాలో కొంతమందిమి మా కూతుళ్లను బానిసలుగా అమ్ముకోవలసి వచ్చింది! మాకు వేరే గత్యంతరం లేదు! ఇప్పటికే మేము మా పొలాలను, ద్రాక్షాతోటలను కోల్పోయాము! అవి ఇప్పుడు ఇతరుల చేతుల్లోకి పోయాయి” అని వాపోయారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మా శరీరం రక్తం మా తోటి యూదుల శరీరం రక్తం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్లాంటివారు కారా? అయినా మా కుమారులను మా కుమార్తెలను బానిసలుగా ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే మా కుమార్తెలలో కొందరు బానిసలుగా ఉన్నారు కాని మా పొలాలు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి మాకు శక్తి లేదు” అన్నారు.

Viz kapitola kopírovat

నెహెమ్యా 5:5

Následuj nás:

Reklamy

Reklamy