Online Bible

- Reklamy -




న్యాయాధి 21:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము –ఆ యుద్ధమునుబట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ఆ తరువాత ఆ అమ్మాయిల తండ్రులు గానీ సోదరులు గానీ మా దగ్గరికి వచ్చి వాదిస్తే మేము వారితో ‘మీరు కాస్త మా పట్ల దయ చూపండి. యుద్ధం కారణంగా వాళ్ళలో ప్రతి వాడికీ పెళ్ళి చేసుకోడానికి స్త్రీలు దొరకలేదు. కాబట్టి ఆ స్త్రీలను ఉండనివ్వండి. మీ అంతట మీరే వాళ్ళను పెళ్లికివ్వలేదు కాబట్టి శపథం విషయంలో మీరు నిరపరాధులు అవుతారు’ అని చెబుతాము” అన్నారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

22 ఆ యువతుల తండ్రులుగాని సోదరులుగాని వెలుపలికి వచ్చి, మాకు ఇది ఫిర్యాదు చేస్తారు. అప్పుడు, ‘బెన్యామీను పురుషుల ఎడల దయకలిగి ఉండండి. వారు ఆ యువతుల్ని వివాహము చేసుకోనివ్వండి. వారు ఈ స్త్రీలను తీసుకున్నారు. కాని మీతో యుద్ధం చెయ్యలేదు. వారు స్త్రీలను తీసుకువెళ్లారు. అందువల్ల దేవునివద్ద చేసిన ప్రతిజ్ఞ మీరు ఉల్లంఘించలేదు. వారికి ఆ యువతులను ఇచ్చి వివాహము చెయ్యమని మీరు ప్రతిజ్ఞ పట్టారు. బెన్యామీను పురుషులకు మీరా యువతులను యివ్వలేదు. వారు మీ వద్దనుంచే ఆ యువతుల్ని తీసుకువెళ్లారు. అందువల్ల మీరు మీ ప్రతిజ్ఞ తప్పలేదు.’” అన్నారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”

Viz kapitola kopírovat




న్యాయాధి 21:22

Následuj nás:

Reklamy


Reklamy