Online Bible

- Reklamy -




న్యాయాధి 20:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 వారిని ఎదిరించడానికి బెన్యామీనీయులు బయటకు వచ్చి వారిని తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్లారు. మునుపటిలా వారు ఇశ్రాయేలీయులలో గాయపడిన వారిని చంపడం మొదలుపెట్టి, బేతేలుకు గిబియాకు వెళ్లే రహదారుల్లో, మైదానాల్లో సుమారు ముప్పైమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 బెన్యామీనీయులు వాళ్ళని ఎదిరించడానికి పట్టణంలో నుండి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలీయులను తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్ళారు. ఇంతకు ముందులాగానే ఇశ్రాయేలీయుల్లో గాయపడ్డవాళ్ళను రాజ మార్గాల్లో చంపుతూ వెళ్ళారు. దాదాపు ముప్ఫై మందిని అలా చంపారు. ఆ మార్గాల్లో ఒకటి బేతేలుకు వెళ్తుంది. మరొకటి గిబియాకు వెళ్తుంది.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

31 బెన్యామీను సైన్యం గిబియా నగరం వెలుపలికి వచ్చింది, ఇశ్రాయేలు సైనికుల్ని ఎదుర్కొనడానికి. ఇశ్రాయేలు సైన్యం వెనుకకు మరలింది. బెన్యామీను సైన్యం తమను తరుముకు రావాలని అలా చేసింది. ఈ విధంగా బెన్యామీను సైన్యం నగరానికి చాలా దూరంలో ఉండాలని మాయోపాయం పన్నబడింది. బెన్యామీను సైన్యం, తాము పూర్వం చేసినట్లుగా, ఇశ్రాయేలు సైనికుల్ని చంపడం మొదలు పెట్టింది. ఇశ్రాయేలుకి చెందిన సుమారు ముఫ్పై మందిని చంపివేయడం జరిగింది. పొలాలలో ఉండేవారిని కొందరిని చంపివేశారు. రాజమార్గం మీద ఉన్న వారిని కొందరిని చంపివేశారు. ఒక రాజమార్గం బేతేలు నగరానికి వెళుతుంది. మరొక రాజమార్గం గిబియా నగరానికి వెళుతుంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 వారిని ఎదిరించడానికి బెన్యామీనీయులు బయటకు వచ్చి వారిని తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్లారు. మునుపటిలా వారు ఇశ్రాయేలీయులలో గాయపడిన వారిని చంపడం మొదలుపెట్టి, బేతేలుకు గిబియాకు వెళ్లే రహదారుల్లో, మైదానాల్లో సుమారు ముప్పైమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.

Viz kapitola kopírovat




న్యాయాధి 20:31

Následuj nás:

Reklamy


Reklamy