యెషయా 44:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఒక మనుష్యుడు దాని కట్టెలను మంట పెట్టడానికి ఉపయోగిస్తాడు; అతడు ఆ కట్టెలలో కొన్ని తీసుకుని చలి కాచుకుంటాడు, అవే కట్టెలతో అతడు నిప్పు రాజేసి రొట్టె కాల్చుకుంటాడు. మిగిలిన కర్రతో ఒక దేవున్ని చేసికొని దానిని పూజిస్తాడు; దానితో ఒక విగ్రహాన్ని చేసి దానికి నమస్కారం చేస్తాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు. మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు. Viz kapitolaపవిత్ర బైబిల్15 అప్పుడు అతడు మంట వేసుకొనేందుకు ఆ చెట్టును వాడుకొంటాడు. అతడు ఆ వృక్షాన్ని చిన్న కట్టె ముక్కలుగా నరుకుతాడు. వంట చేసుకొనేందుకు, చలి కాచుకొనేందుకు అతడు ఆ కట్టెలను వాడుకొంటాడు. కొన్ని కట్టెలతో అతడు మంట చేసి, రొట్టె కాల్చుకొంటాడు. అయితే అతడు ఆ కట్టెల్లో ఒక భాగాన్ని దేవునిగా చేయటానికి ఉపయోగిస్తాడు. మరియు ఆ మనిషి ఆ దేవుణ్ణి పూజిస్తాడు. ఆ దేవుడు ఆ మనిషి చేసిన విగ్రహమే కానీ ఆ మనిషి ఆ విగ్రహం ముందు సాష్టాంగపడతాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఒక మనుష్యుడు దాని కట్టెలను మంట పెట్టడానికి ఉపయోగిస్తాడు; అతడు ఆ కట్టెలలో కొన్ని తీసుకుని చలి కాచుకుంటాడు, అవే కట్టెలతో అతడు నిప్పు రాజేసి రొట్టె కాల్చుకుంటాడు. మిగిలిన కర్రతో ఒక దేవున్ని చేసికొని దానిని పూజిస్తాడు; దానితో ఒక విగ్రహాన్ని చేసి దానికి నమస్కారం చేస్తాడు. Viz kapitola |