ఆదికాండము 27:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఇస్సాకు మిక్కు టముగా గడగడ వణకుచు–అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలోతిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. “అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.” Viz kapitolaపవిత్ర బైబిల్33 అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి, నా దగ్గరకు తీసుకువచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!” Viz kapitola |