యెహెజ్కేలు 44:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, యెహోవా ఆలయానికి సంబంధించిన అన్ని నియమాలు విధుల గురించి నేను నీకు చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని గ్రహించు. మందిరం లోపలికి వచ్చే మార్గాన్ని పరిశుద్ధస్థలం నుండి బయటకు వెళ్లే అన్ని మార్గాలను శ్రద్ధగా గమనించు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా–నరపుత్రుడా, యెహోవా మందిరమునుగూర్చిన కట్టడ లన్నిటిని విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను; నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధస్థలములోనుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోపలికి వచ్చుటనుగూర్చి యోచించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, యెహోవా మందిరం గురించిన కట్టడలు, విధులు అన్నిటిని నేను నీకు తెలియజేస్తున్నాను, నీవు శ్రద్ధగా గమనించు. ఈ సంగతులన్నిటిని నీ కళ్ళతో చూసి చెవులతో ఆలకించు. మందిరం బయటికి పోయే, లోపలి వచ్చే మార్గాలను గూర్చి ఆలోచించు. Viz kapitolaపవిత్ర బైబిల్5 యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, జాగ్రత్తగా చూడు! నీ కండ్లను, చెవులను ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను యెహోవా ఆలయం యొక్క నియమ నిబంధనలను గురించి చెప్పే ప్రతి విషయాన్ని నీవు శ్రద్ధగా విను. ఆలయ ప్రవేశద్వారాల వైపు, ఆలయం నుండి బయటికి పోయే ద్వారములన్నిటి వైపూ పరిశీలనగా చూడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, యెహోవా ఆలయానికి సంబంధించిన అన్ని నియమాలు విధుల గురించి నేను నీకు చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని గ్రహించు. మందిరం లోపలికి వచ్చే మార్గాన్ని పరిశుద్ధస్థలం నుండి బయటకు వెళ్లే అన్ని మార్గాలను శ్రద్ధగా గమనించు. Viz kapitola |