యెహెజ్కేలు 31:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని, అగాధజలములు అతని కప్పజేసితిని, అనేక జలములను ఆపి అతనినిబట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని, అతనికొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసితిని, ఫలవృక్షములన్నియు అతనిగూర్చి వ్యాకులపడెను, పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవువారియొద్దకు అతని పడ వేయగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “అతడు పాతాళం లోకి పోయిన రోజు నేను భూమికి దుఃఖం కలిగించాను. అగాధజలాలు అతన్ని ముంచేలా చేశాను. సముద్రపు నీటిని ఆపాను. అతన్ని బట్టి నేను వాటి ప్రవాహాలను బంధించాను. అతని కోసం నేను లెబానోనుకు దుఃఖం కలిగించాను. కాబట్టి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ అతని కోసం దుఃఖించాయి. Viz kapitolaపవిత్ర బైబిల్15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఆ చెట్టు పాతాళానికి వెళ్లిన రోజున ప్రజలంతా సంతాపం పొందేలా చేశాను. అగాధమైన సముద్రంలో దాన్ని కప్పివేశాను. దాని నదులన్నిటినీ నిలుపు జేశాను. నీరంతా ప్రవహించటం ఆగిపోయింది. లెబానోను దాని కొరకు దుఃఖించేలా చేశాను. ఆ మహావృక్షం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ విచారంతో క్రుంగిపోయాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. Viz kapitola |