యెహెజ్కేలు 25:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నాకోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదో మీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను. ఎదోమీయుల విషయంలో నా కోపాన్ని బట్టి నా రౌద్రాన్ని బట్టి, ఇశ్రాయేలీయులు నా ఆలోచన నెరవేరుస్తారు! ఎదోమీయులు నా ప్రతీకారం చవి చూస్తారు.” ఇదే యెహోవా వాక్కు. Viz kapitolaపవిత్ర బైబిల్14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వినియోగించి ఎదోముకు వ్యతిరేకమవుతాను. ఈ రకంగా ఇశ్రాయేలు కూడా ప్రజలు ఎదోముపై నాకు గల కోపాన్ని చూపిస్తారు. అప్పుడు నేనే వారిని శిక్షించినట్లు ఎదోము ప్రజలు తెలుసుకుంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ” Viz kapitola |