దానియేలు 11:39 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 అతడు పరదేశి దేవుని సహాయంతో బలమైన కోటల మీద దాడి చేసి, తనను గుర్తించిన వారిని గొప్పగా ఘనపరుస్తాడు. వారిని అనేకుల మీద పాలకులుగా నియమిస్తాడు, వెలకు దేశాన్ని పంచిపెడతాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 మరియు ఈ క్రొత్త దేవతను ఆధారముచేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహాఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకులమీద తనవారికి ప్రభుత్వ మిచ్చును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 ఈ అపరిచిత దేవుడి సహాయంతో అతడు అతి బలిష్ఠమైన దుర్గాల పై దాడి చేస్తాడు. తనను అంగీకరించిన గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అనేకుల మీద తన వారిని పరిపాలకులుగా చేస్తాడు. ప్రభుత్వ మిస్తాడు. దేశాన్ని వెల కట్టి పంచిపెడతాడు. Viz kapitolaపవిత్ర బైబిల్39 “ఆ ఉత్తర రాజు బలమైన కోటల మీదికి అన్యదేవుని సహాయంతో దాడి చేస్తాడు, తనను గుర్తించే వాళ్లను హెచ్చించి గౌరవిస్తాడు. వాళ్లను చాలామంది ప్రజలమీద పరిపాలకులుగా ఉంచి, దేశాన్ని వెలకు విభాగిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 అతడు పరదేశి దేవుని సహాయంతో బలమైన కోటల మీద దాడి చేసి, తనను గుర్తించిన వారిని గొప్పగా ఘనపరుస్తాడు. వారిని అనేకుల మీద పాలకులుగా నియమిస్తాడు, వెలకు దేశాన్ని పంచిపెడతాడు. Viz kapitola |