2 సమూయేలు 16:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దావీదు కొండమీద కొంత దూరం వెళ్లినప్పుడు, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతన్ని కలవడానికి వేచి ఉన్నాడు. అతడు కళ్లకు గంతలు కట్టివున్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్ష గెలలు, 100 అంజూర పండ్లు ఉన్న కొమ్మలు, ఒక ద్రాక్షరసపు తిత్తి ఉన్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసికొనివచ్చెను; రెండు వందల రొట్టెలును నూరు ద్రాక్ష గెలలును నూరు అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటిమీద వేసి యుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి. Viz kapitolaపవిత్ర బైబిల్1 ఒలీవల పర్వతం మీద దావీదు కొంతవరకు వెళ్లాడు. అక్కడ మెఫీబోషెతు సేవకుడైన సీబా దావీదును కలిశాడు. సీబా వెంట గంతలు కట్టిన రెండు గాడిదలున్నాయి. గాడిదల మీద రెండు వందల రొట్టెలు, ఒక వంద ఎండు ద్రాక్షాగుత్తులు, ఒక వంద అంజూరపు పండ్లు, ఒక ద్రాక్షారసపు తిత్తివున్నాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దావీదు కొండమీద కొంత దూరం వెళ్లినప్పుడు, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతన్ని కలవడానికి వేచి ఉన్నాడు. అతడు కళ్లకు గంతలు కట్టివున్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్ష గెలలు, 100 అంజూర పండ్లు ఉన్న కొమ్మలు, ఒక ద్రాక్షరసపు తిత్తి ఉన్నాయి. Viz kapitola |