Online Bible

- Reklamy -

2 రాజులు 19:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, “నా అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

23 నీ దూతల ద్వారా యెహోవాను అవమానించి నీవు ఇలా చెప్పావు: “ఉన్నత పర్వతాలకు నేను వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను లోపలికి వచ్చాను నేను ఉన్నత దేవదారుల వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ వృక్షాలను చేధించాను. పచ్చని అడవికి నేను వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, “నా అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.

Viz kapitola kopírovat

2 రాజులు 19:23

Následuj nás:

Reklamy

Reklamy