2 రాజులు 15:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఇశ్రాయేలురాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు. Viz kapitolaపవిత్ర బైబిల్29 అష్షూరు పాలకుడైన తిగ్లత్పిలేసెరు ఇశ్రాయేలుకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా పెకహు వున్న కాలంలో ఇది జరిగింది. తిగ్లత్పిలేసరు, ఈయోను, ఆబేల్బేత్మయకా, హాసోరు, గిలాదు, యానోయహు కెదెషు గలిలయ మరియు నఫ్తాలీ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ అన్ని స్థలాలనుండి తిగ్లత్పిలేసరు ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకు వెళ్లాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు. Viz kapitola |