Online Bible

- Reklamy -

1 సమూయేలు 12:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

3 ఇప్పుడు నేను మీ సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి, ఆయన ఏర్పరచిన రాజుకు చెప్పండి. నేను ఎవరి ఎద్దునే గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినైనా భాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనెప్పుడైన డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులేవైనా చేసి ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు సరిదిద్దుకుంటాను.”

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.

Viz kapitola kopírovat

1 సమూయేలు 12:3

Následuj nás:

Reklamy

Reklamy