Online Bible

- Reklamy -




1 రాజులు 20:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 ఆ మనుష్యులు దీనిని మంచి సూచనగా తీసుకుని, అతని మాటను త్వరగా అందుకున్నారు. “అవును, బెన్-హదదు మీ సోదరుడు” అని వారు అన్నారు. అప్పుడు రాజు, “మీరు వెళ్లి అతన్ని తీసుకురండి” అన్నాడు. బెన్-హదదు బయటకు వచ్చినప్పుడు, అహాబు అతన్ని తన రథంలో ఎక్కించుకున్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగున నున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటనుబట్టి– బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు–మీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను. బెన్హదదు తనయొద్దకు రాగా అతడు తన రథముమీద అతని ఎక్కించుకొనెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 అప్పుడు వాళ్ళు అహాబు దగ్గర్నుంచి ఏదైనా సూచన కోసం కనిపెడుతూ ఉండి, అతడా మాట అనగానే వెంటనే “అవును, బెన్హదదు మీ సోదరుడే” అన్నారు. అప్పుడు అహాబు “మీరు వెళ్లి అతన్ని తీసుకు రండి” అన్నాడు. బెన్హదదు తన దగ్గరికి వచ్చినప్పుడు, అహాబు తన రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

33 బెన్హదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా దయచూపి బెన్హదదును చంపనని నిరూపించే విధంగా ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్హదదును నా సహోదరుడని అహాబు అన్నాడో, వచ్చిన మనుష్యులు వెంటనే, “అవును! బెన్హదదు నీ సోదరుడే!” అని అన్నారు. “అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు అన్నాడు. తరువాత బెన్హదదు రాజైన అహాబు ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన రథం ఎక్కమన్నాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 ఆ మనుష్యులు దీనిని మంచి సూచనగా తీసుకుని, అతని మాటను త్వరగా అందుకున్నారు. “అవును, బెన్-హదదు మీ సోదరుడు” అని వారు అన్నారు. అప్పుడు రాజు, “మీరు వెళ్లి అతన్ని తీసుకురండి” అన్నాడు. బెన్-హదదు బయటకు వచ్చినప్పుడు, అహాబు అతన్ని తన రథంలో ఎక్కించుకున్నాడు.

Viz kapitola kopírovat




1 రాజులు 20:33

Následuj nás:

Reklamy


Reklamy