1 రాజులు 20:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 వారు నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలమీద త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్లి అన్నారు, “మీ సేవకుడైన బెన్-హదదు ఇలా చెప్తున్నాడు: ‘దయచేసి నన్ను బ్రతకనివ్వండి.’ ” రాజు జవాబిస్తూ, “అతడు ఇంకా ప్రాణంతో ఉన్నాడా? అతడు నా సోదరుడు” అని అన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 కావునవారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలురాజు నొద్దకు వచ్చి–నీ దాసుడైన బెన్హదదు–దయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు–బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 కాబట్టి వాళ్ళు తమ నడుములకు గోనెపట్టాలు కట్టుకుని తలమీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి “నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బతకనిమ్మని మనవి చేయడానికి మమ్మల్ని పంపాడు” అని చెప్పారు. అతడు “బెన్హదదు నా సోదరుడు. అతడింకా బతికే ఉన్నాడా” అని అడిగాడు. Viz kapitolaపవిత్ర బైబిల్32 వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బ్రతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు. “అయితే అతడింకా బ్రతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 వారు నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలమీద త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్లి అన్నారు, “మీ సేవకుడైన బెన్-హదదు ఇలా చెప్తున్నాడు: ‘దయచేసి నన్ను బ్రతకనివ్వండి.’ ” రాజు జవాబిస్తూ, “అతడు ఇంకా ప్రాణంతో ఉన్నాడా? అతడు నా సోదరుడు” అని అన్నాడు. Viz kapitola |