Online Bible

- Reklamy -




1 రాజులు 20:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఈ వార్త వచ్చినప్పుడు బెన్-హదదు, అతనితో ఉన్న రాజులు తమ గుడారాల్లో త్రాగుతూ ఉన్నారు. అతడు తన మనుష్యులతో, “దాడికి సిద్ధపడండి” అని ఆదేశించాడు. కాబట్టి వారు పట్టణం మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 బెన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 తమ గుడారాల్లో బెన్హదదు, అతని తోటి రాజులు తాగుతూ ఉన్నప్పుడు ఈ కబురు విన్నారు. కాబట్టి అతడు తన సేవకులను పిలిపించి “యుద్ధానికి సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12 రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఈ వార్త వచ్చినప్పుడు బెన్-హదదు, అతనితో ఉన్న రాజులు తమ గుడారాల్లో త్రాగుతూ ఉన్నారు. అతడు తన మనుష్యులతో, “దాడికి సిద్ధపడండి” అని ఆదేశించాడు. కాబట్టి వారు పట్టణం మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు.

Viz kapitola kopírovat




1 రాజులు 20:12

Následuj nás:

Reklamy


Reklamy