1 రాజులు 2:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 మరియు వీరి ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతివారును సదా కాలము ఉత్తరవాదులుగాని, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవావలన ఎన్నటెన్నటికిని కలిగి యుండును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.” Viz kapitolaపవిత్ర బైబిల్33 వాళ్ల చావుకు కారణమయిన అపరాధి అతనే. తన కుటుంబం కూడా శాశ్వతంగా ఈ నేరానికి బాధ్యులు. కాని దావీదుకు, అతని సంతతివారికి, అతని కుటుంబానికి, అతని సింహాసనానికి దేవుడు శాశ్వతంగా శాంతిని చేకూర్చుతాడు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు. Viz kapitola |