Online Bible

- Reklamy -




1 రాజులు 14:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 నీటిలో రెల్లు ఊగిసలాడినట్లు యెహోవా ఇశ్రాయేలును అల్లాడిస్తారు. ఆయన ఇశ్రాయేలు పూర్వికులకు ఇచ్చిన ఈ మంచి నేల నుండి వారిని తొలగించి యూఫ్రటీసు నది అవతలికి చెదరగొడతారు, ఎందుకంటే వారు అషేరా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం రేపారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 ఇశ్రాయేలువారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ఇశ్రాయేలువారు అషేరా దేవతా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు, కాబట్టి నీళ్ళల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని ఊడబెరికి, వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొడతాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

15 అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 నీటిలో రెల్లు ఊగిసలాడినట్లు యెహోవా ఇశ్రాయేలును అల్లాడిస్తారు. ఆయన ఇశ్రాయేలు పూర్వికులకు ఇచ్చిన ఈ మంచి నేల నుండి వారిని తొలగించి యూఫ్రటీసు నది అవతలికి చెదరగొడతారు, ఎందుకంటే వారు అషేరా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం రేపారు.

Viz kapitola kopírovat




1 రాజులు 14:15

Následuj nás:

Reklamy


Reklamy