ప్రకటన 1:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యుసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. Viz kapitolaపవిత్ర బైబిల్1 దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు చూపించడానికి యేసు క్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు చూపించడానికి యేసు క్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు కనుపరచడానికి యేసుక్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేసారు. Viz kapitola |