2 దిన 34:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వారు ప్రధానయాజకుడైన హిల్కీయా దగ్గరికి వచ్చి, అంతకు ముందు దేవుని మందిరంలోకి తీసుకు వచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశాల్లోని ఇశ్రాయేలు వారిలో మిగిలి ఉన్న వారందరి దగ్గరనుంచి, యూదా బెన్యామీనీయులందరి దగ్గరనుంచి ఆ డబ్బు సమకూర్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 వారు ప్రధానయాజకుడైన హిల్కీయాయొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశములయందు ఇశ్రాయేలువారిలో శేషించియున్న వారందరియొద్దనుండియు, యూదా బెన్యామీనీయులందరి యొద్దనుండియుకూర్చి, దేవుని మందిరములోనికి తీసికొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. Viz kapitolaపవిత్ర బైబిల్9 ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు వచ్చారు. ప్రజలు ఆలయానికి ఇచ్చిన కానుకల ధనాన్ని వారు హిల్కీయాకు ఇచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ఎఫ్రాయిము ప్రజల నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూషలేము ప్రజల నుండి కూడ సేకరించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయిమీయుల, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారందరు, యూదా వారు, బెన్యామీనీయులు, యెరూషలేము నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీయులు దానిని జమచేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయిమీయుల, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారందరు, యూదా వారు, బెన్యామీనీయులు, యెరూషలేము నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీయులు దానిని జమచేశారు. Viz kapitola |