కీర్తన 126 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)యాత్రకీర్తన. 1 సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు 2 మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు–యెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. 3 యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతిమి. 4 దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము. 5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. 6 పిడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానముచేయుచు పనలు మోసికొనివచ్చును. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India