కీర్తన 141:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. నా తల దానిని నిరాకరించదు, కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమువారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నీతిమంతులు నన్ను కొడితే అది నాకు దయ చూపినట్టే. వాళ్ళు నన్ను మందలిస్తే అది నా తలకి నూనె రాసినట్టే. అలాంటి దాన్ని నేను అంగీకరిస్తాను. నా ప్రార్థనలు మాత్రం దుర్మార్గుల క్రియలకు వ్యతిరేకంగా ఉంటాయి. Ver Capítuloపవిత్ర బైబిల్5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు. అది నాకు మంచిదే. వారి విమర్శను నేను అంగీకరిస్తాను. నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. నా తల దానిని నిరాకరించదు, కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను. Ver Capítulo |