La Biblia Online

- Anuncios -




యిర్మీయా 25:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 కాపరులారా, ఏడవండి రోదించండి; మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి. ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది; మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 కాపరులారా, ఏడవండి. సాయం కోసం కేకలు పెట్టండి. మందలోని నాయకులారా, నేల మీద పడి దొర్లండి. మీరు చావడానికి రోజులు దగ్గరపడ్డాయి. మీరు చెదిరిపోయే రోజు వచ్చింది. ఎంపిక చేసిన గొర్రె పొట్టేళ్ళు కింద పడినట్టు మీరు పడతారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

34 కాపరులారా (నాయకులారా), మీరు మందను (ప్రజలను) కాయవలసి ఉంది. కాని ఓ గొప్ప నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి. గొర్రెల కాపరులారా, నేలమీద పడి బాధతో పొర్లండి ఎందువల్లనంటే మీరు సంహరించబడే సమయం సమీపిస్తూ ఉంది. మిమ్ములను కొట్టి చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా మీరు చిందర వందరై పోతారు!

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 కాపరులారా, ఏడవండి రోదించండి; మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి. ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది; మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.

Ver Capítulo Copiar




యిర్మీయా 25:34

Síguenos en:

Anuncios


Anuncios