1 సమూయేలు 10:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అయితే మీ కష్టాలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు తిరస్కరించారు. ‘మామీద రాజుగా ఒకరిని నియమించు’ అని ఆయనను అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల ప్రకారం మీరు యెహోవా సన్నిధికి రావాలి.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి–మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావ లెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. ‘మా మీద ఒకరిని రాజుగా నియమించు’ అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు, మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి.” Ver Capítuloపవిత్ర బైబిల్19 మళ్లీ ఇశ్రాయేలీయులతో సమూయేలు ఇలా అన్నాడు: ‘మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించటానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు.’ సరే. రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా దేవుని ముందర నిలబడండి.” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అయితే మీ కష్టాలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు తిరస్కరించారు. ‘మామీద రాజుగా ఒకరిని నియమించు’ అని ఆయనను అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల ప్రకారం మీరు యెహోవా సన్నిధికి రావాలి.” Ver Capítulo |