1 దిన 28:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దావీదు ఇశ్రాయేలీయుల అధికారులందరిని అనగా, గోత్రాల అధికారులను, రాజు సేవలో ఉన్న సైన్యాల విభాగాల అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజుకు రాజకుమారులకు ఉన్న ఆస్తి మీద, పశువులన్నిటి మీద ఉన్న అధికారులను, రాజపరివారాన్ని, పరాక్రమశాలులను, యుద్ధ వీరులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధు లైన పరాక్రమశాలులనందరిని రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 గోత్రాల పెద్దలనూ, వంతుల చొప్పున రాజుకు సేవ చేసే అధిపతులనూ సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ, రాజుకూ, రాకుమారులకూ ఉన్న యావత్తు స్థిర చరాస్తుల మీదా ఉన్న అధిపతులను అంటే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ, రాజు దగ్గరున్న పరివారాన్నీ, పరాక్రమశాలురనూ, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజైన దావీదు యెరూషలేములో సమావేశపరిచాడు. Ver Capítuloపవిత్ర బైబిల్1 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దావీదు ఇశ్రాయేలీయుల అధికారులందరిని అనగా, గోత్రాల అధికారులను, రాజు సేవలో ఉన్న సైన్యాల విభాగాల అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజుకు రాజకుమారులకు ఉన్న ఆస్తి మీద, పశువులన్నిటి మీద ఉన్న అధికారులను, రాజపరివారాన్ని, పరాక్రమశాలులను, యుద్ధ వీరులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు. Ver Capítulo |