సంఖ్యా 33:54 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 చీట్లు వేసి మీ వంశాల ప్రకారం ఆ దేశాన్ని పంచుకోండి. పెద్ద గోత్రాలకు ఎక్కువ వారసత్వం చిన్న గోత్రాలకు తక్కువ వారసత్వంగా పంచుకోండి. చీట్లలో ఏది వస్తే, అది వారికి చెందుతుంది. మీ పూర్వికుల గోత్రాల ప్రకారం దానిని పంచుకోండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్54 మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసుకొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ దేశంలో పెద్ద భాగం ఇవ్వాలి. చిన్న కుటుంబాలకు ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వాలి. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 చీట్లు వేసి మీ వంశాల ప్రకారం ఆ దేశాన్ని పంచుకోండి. పెద్ద గోత్రాలకు ఎక్కువ వారసత్వం చిన్న గోత్రాలకు తక్కువ వారసత్వంగా పంచుకోండి. చీట్లలో ఏది వస్తే, అది వారికి చెందుతుంది. మీ పూర్వికుల గోత్రాల ప్రకారం దానిని పంచుకోండి. Sien die hoofstuk |