2 దిన 2:14 - పవిత్ర బైబిల్14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము – అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము – అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడ మంచి నేర్పరి. పైగా హూరాము – అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గల వాడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్ళతో, కలపతో, నేరేడు రంగు నూలుతో నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో, పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో, మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికీ, నీ తండ్రీ నా ప్రభువూ అయిన దావీదు నియమించిన నిపుణులకీ సహాయకుడుగా ఉండడానికి సమర్ధుడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు. Sien die hoofstuk |