Aanlyn Bybel

- Advertensies -

జెకర్యా 1:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 “వీరు ఏమి చేయడానికి వస్తున్నారు?” అని నేను అడిగాను. అందుకాయన, “ఎవ్వరూ తమ తల ఎత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే కంసాలులు వారిని భయభ్రాంతులకు గురిచేసి, యూదా దేశంలోని ప్రజలను చెదరగొట్టడానికి తమ కొమ్ములను ఎత్తిన దేశాల కొమ్ములను పడగొట్టడానికి వచ్చారు” అని అన్నారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 –వీరేమి చేయబోవుచున్నారని నేనడిగినందుకు ఆయన–ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 “వీళ్ళు ఏమి చేయబోతున్నారు?” అని నేను అడిగాను. ఆయన “ఇవి ఎవ్వరూ తల ఎత్తకుండా యూదా ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు. యూదా దేశ నివాసులను చెదరగొట్టడానికి వారిపై దురాక్రమణ జరిగించిన అన్య దేశాల ప్రజలను భయపెట్టడానికి కొమ్ములను నేలమట్టం చేయడానికి ఈ కంసాలి పనివాళ్ళు వచ్చారు” అని నాకు బదులిచ్చాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

21 “ఈ నలుగురు పనివారు ఏమి చేయటానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను. అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ కొమ్ములు యూదాప్రజలను అన్యదేశాలకు పోయేలా ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికీ కనికరం చూపలేదు. యూదా ప్రజలపై దాడిచేసి, వారిని అన్యదేశాలకు వెడలగొట్టిన రాజ్యాలకు చిహ్నలుగా ఈ కొమ్ములు ఉన్నాయి.”

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 “వీరు ఏమి చేయడానికి వస్తున్నారు?” అని నేను అడిగాను. అందుకాయన, “ఎవ్వరూ తమ తల ఎత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే కంసాలులు వారిని భయభ్రాంతులకు గురిచేసి, యూదా దేశంలోని ప్రజలను చెదరగొట్టడానికి తమ కొమ్ములను ఎత్తిన దేశాల కొమ్ములను పడగొట్టడానికి వచ్చారు” అని అన్నారు.

Sien die hoofstuk Kopieer

జెకర్యా 1:21

Volg ons:

Advertensies

Advertensies