Aanlyn Bybel

- Advertensies -




యిర్మీయా 44:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.”

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాటవినుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా –ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణముచేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయుచున్నాను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 అయితే ఐగుప్తులో నివసించే యూదా ప్రజలందరూ యెహోవా మాట వినండి. ఆయన ఇలా అంటున్నాడు. చూడండి. నేను నా ఘన నామంపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఐగుప్తులో ఉన్న యూదులంతా ఇప్పుడు ‘యెహోవా జీవం తోడు’ అంటూ ఉంటారు. అయితే ఐగుప్తులో ఉన్న యూదుల్లో ఎవ్వరూ ఇక మీదట నా పేరును తమ నోటితో పలకరు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

26 కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా, యెహోవా సందేశాన్ని వినండి: ‘మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా” అని వారు చెప్పరు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.”

Sien die hoofstuk Kopieer




యిర్మీయా 44:26

Volg ons:

Advertensies


Advertensies