దానియేలు 3:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాబట్టి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ వచ్చి దాని ఎదుట నిలబడ్డారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆ అధికారులు, ప్రముఖులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, మంత్రులు, ఖజానా అధికారులు, ధర్మశాస్త్ర పండితులు, న్యాయాధిపతులు, సంస్థానాల్లో నాయకత్వం వహించేవాళ్ళు, ప్రజలందరూ రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడివచ్చి, విగ్రహం ఎదుట నిలబడ్డారు. Sien die hoofstukపవిత్ర బైబిల్3 రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాబట్టి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ వచ్చి దాని ఎదుట నిలబడ్డారు. Sien die hoofstuk |